చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఒడిపోవడం ఖాయం

chandrababu, ktr
chandrababu, ktr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఈరోజు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.పార్లమెంట్‌ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో షెడ్యూల్‌ ప్రకటిస్తాం. 16 స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతాం. కేంద్రంలో కాంగ్రెస్‌,బిజెపికి తగిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని డిమాండ్‌.. కమాండ్‌ చేయవచ్చు అని కెటిఆర్‌ పేర్కొన్నారు.ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని కెటిఆర్‌ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాదని ఎవరైనా చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుస్తదని అనిపిస్తోంది. చంద్రబాబు కలలో కూడా సీఎం సిఎం కెసిఆర్‌ను కలవరిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఒడిపోవడం ఖాయం. ఢిల్లీలో కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేడు.అని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు.