పవన్ ఫ్యాన్స్ కు ప్రామిస్ ఇచ్చిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ డైరెక్టర్ ప్రామిస్ ఇచ్చి వారిలో ఉత్సహం నింపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నాడనే కానీ అవి ఎప్పుడు పూర్తి అవుతాయో..ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే పవన్ ఓ పక్క సినిమా , మరో పక్క రాజకీయం చేస్తున్నాడు. ఆలా రెండు చూసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో ఏదో పూర్తి కాకుండా అయిపోతుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసిన రెండేళ్లు అవుతున్న..ఇంతవరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో మరో రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయనేది తెలియకుండా అయిపొయింది.

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్లు చాల నెలల క్రితమే ప్రకటన వచ్చింది. కానీ ఇంత వరకు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ శంకర్ మాత్రం తాజాగా ఓ ట్వీట్ వేశాడు. పవర్ స్టార్ అభిమానుల ట్వీట్లకు అప్పుడప్పుడు హరీష్ రిప్లై ఇస్తుంటాడు. ఆ స్టైలు, స్వాగ్, స్టెప్స్ ఏమైపోయాయ్ కళ్యాణ్ అన్నా. హరీష్ శంకర్ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ వేశాడు. దీనిపై హరీష్ స్పందించాడు. అన్నీ ఉంటాయ్.. ఏదీ మిస్ అవ్వదు.. మీ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది నన్ను నమ్మండి అంటూ రిప్లై ఇవ్వడంతో అభిమానులు సంబరపడిపోతోన్నారు. మరి నిజంగా హరీష్ ..అభిమానుల కోరిక తీరుస్తాడా అనేది చూడాలి.