తిరుమ‌ల‌ శ్రీవారి హుండీకి రూ.5.05 కోట్లు ఆదాయం

tirumala
tirumala

తిరుమలః తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పరిసరాల్లో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి . నిన్న 74,212 మంది భక్తులు స్వామివారి దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి.

పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం చేపట్టారు . పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రెడ్డిశేఖ‌ర్‌, శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/