లోక్‌స‌భ ఘ‌ట‌న.. ఇది ముమ్మాటికీ భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మే : కార్తీ చిదంబ‌రం

Parliament security breach: How leaders reacted to security breach in Lok Sabha

న్యూఢిల్లీ : లోక్‌స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం క‌ల‌క‌లం రేపింది. పార్ల‌మెంట్‌పై దాడి జ‌రిగి బుధ‌వారం నాటికి సరిగ్గా 22 ఏండ్లు కాగా, ఇదే రోజు ఇద్ద‌రు ఆగంత‌కులు ప‌బ్లిక్ గ్యాల‌రీ నుంచి దూకడం దుమారం రేపింది. స‌భ‌లో ప‌సుపు రంగు గ్యాస్‌ను ఆగంత‌కులు వ‌ద‌ల‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. జీరో అవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ్గా వెంట‌నే స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. స‌భ జ‌రుగుతుండ‌గా అనూహ్యంగా 20 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు వ్య‌క్తులు విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి స‌భ‌లోకి దూకి ప‌సుపు రంగు గ్యాస్‌ను వ‌దిలార‌ని చెప్పారు. వారు కొన్ని నినాదాలు చేశార‌ని, వారు వ‌దిలిన గ్యాస్ విష వాయువు కావ‌చ్చ‌ని, ఇది తీవ్ర భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మ‌ని కార్తీ చిదంబ‌రం పేర్కొన్నారు. 2001లో డిసెంబ‌ర్ 13న పార్ల‌మెంట్‌పై దాడి జ‌ర‌గ్గా సరిగ్గా ఇదే రోజు ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌ర్హ‌నీయ‌మ‌ని, ఇది ముమ్మాటికీ భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మేన‌ని కార్తీ చిదంబ‌రం వ్యాఖ్యానించారు.