బిఆర్ఎస్ నుండి తొలి ఎంపీని ప్రకటించిన మంత్రి కేటీఆర్

శుక్రవారం హుస్నాబాద్‌ నియోజక వర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్..కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో బిజీ బిజీ గా మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా నగరంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో ఇండోర్‌ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఎస్టీ బాలికల హాస్టల్‌ ప్రారంభించారు. లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు.

అనంతరం సభలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో రైతు సంక్షేమ ప‌థ‌కాలు అనేకం అమ‌ల‌వుతున్నాయి. కేసీఆర్ కాళేశ్వ‌రం నీళ్ల‌ను పైకి మ‌ళ్లిస్తున్నాడు అప‌ర భ‌గీర‌థుడిలా. ఈ ప్రాంతంలో శాశ్వ‌తంగా క‌రువును త‌రిమేసాం. కాళేశ్వ‌రం నీళ్లు.. కొండ‌పోచమ్మ‌, మ‌ల్ల‌న్న సాగ‌ర్, రంగ‌నాయ‌క సాగ‌ర్, మిడ్ మానేరు వ‌ర‌కు నీళ్లు వ‌స్తున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతం ఇప్పుడు స‌స్య‌శ్యామలంగా ఉంద‌న్నారు. బండి సంజయ్ ను ఇంటికి పంపాలని ప్రజలను కోరారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పడానికి తనకు సిగ్గుగా ఉందని, రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మళ్లీ వినోద్ ను గెలిపించాలి. బండి సంజయ్ ను ఇంటికి పంపాలి అని కోరారు.