మహేష్ మసాలా యాడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాలతోనే కాదు కమర్షియల్ యాడ్స్ లలో కూడా బిజీ గా ఉంటాడు. ఇప్పటికే ఎన్నో బ్రాండ్ లకు ప్రచార కర్త గా ఉన్న మహేష్..తాజాగా మసాలా యాడ్ లో కనిపించాడు. ఎవరెస్ట్ గరం మసాలా కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబదించిన యాడ్ ను రిలీజ్ చేసారు. “సౌత్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి భోజనం తయారీలో ఎవరెస్ట్ గరం మసాలానే వాడతారన్న విషయం ఇప్పుడే తెలిసింది” అంటూ ఎవరెస్ట్ స్పైసెస్ తన యాడ్ కంటెంట్ ను వివరించింది.

ఇక మహేష్ కుటుంబం లో ఈ ఏడాది విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర్ని పోగొట్టుకున్నాడు మహేష్. అన్న, అమ్మ , తండ్రి ఇలా ముగ్గుర్ని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ దుఃఖం నుండి బయటపడేందుకు సినిమాల ఫై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా..ఆ తర్వాత వరుస విషాదాలు మహేష్ ఎదురుకోవడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం సినిమా తాలూకా మ్యూజిక్ సెట్టింగ్స్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. సంక్రాంతి తరువాత కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.