తెలంగాణలో డ్ర‌గ్స్‌ వ్యవహారం..ఢిల్లీకి చేరిందా..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో సినీ ప్రముఖులను డ్రగ్స్ వ్యవహారం నిద్ర లేకుండా చేయగా..ఇప్పుడు రాజకీయ నేతలను నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం నడుస్తుందని సాక్షాలతో బయటపడడం తో రాజకీయంగా చర్చ గా మారింది. ఈ వ్యవహారం ఎంత పెద్దవారు ఉన్న సరే వదిలేదు లేదని రాష్ట్ర సర్కార్ చెపుతుంటే..రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను పట్టుకొని..దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందని తెలుసుకునే పనిలో ఉన్నారు. కాగా ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు డిల్లీకి చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌మ‌గ్ర నివేదిక కేంద్ర ప్ర‌భుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. బుధ‌వారం నాడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌.. గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీలోనే తెలంగాణ‌లో డ్ర‌గ్స్ దందాకు సంబంధించిన నివేదిక‌ను అమిత్‌షాకు గ‌వ‌ర్న‌ర్ అంద‌జేసినట్టు తెలుస్తుంది. మరి దీని వ్యవహారం లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.