అమ్మకాలవైపే ఇన్వెస్టర్ల ఆసక్తి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు గురువారం నష్టాల్లో ముగిసాయి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతుండడంతో మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలు మొగ్గుచూపారు. దీంతో అమెరికా ఇండెక్సుల ఫ్యూచర్స్ పడిపోగా, ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నడిచింది. ఈ నేపథ్యం లో బలహీనంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 41,460వద్ద స్థిరపడ గా, నిఫ్టీ కూడా 27 పాయింట్లు పడిపోయి 12,175వద్ద స్థిరపడింది. యూరప్‌లోనూ మార్కె ట్లు ఒక శాతం నష్టాలతో ప్రారంభంకావడంతో దేశీయంగా మధ్యాహ్నంలో అమ్మకాలు ఊపందు కున్నాయి
. దీంతో సెన్సెక్స్ 41,338వద్ద ఇంట్రా డే కనిష్టానికి చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలో సాధించిన 41,709పాయింట్లే ఇంట్రాడే గరిష్టం గా నమోదు కావడం విశేషం. ఇక నిఫ్టీ కూడా 12,226- 12,140పాయింట్ల మధ్య హెచ్చుతగ్గు లను చవిచూసింది. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ రంగాలు 1.4-0.5 శాతం మధ్య పతనం కాగా, ఐటి, ఫార్మా 0.9 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డి ఎఫ్‌సి, కోల్‌ఇండియా, బిపిసిఎల్, అదానీఫోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు 3.6- 1.2 శాతం మధ్య పడిపోయాయి
. అయితే ఎస్ బ్యాంకు 6.4శాతం పెరిగింది. ఈ దారిలోనే డాక్టర్‌రెడ్డీస్, జీ ఎంటర్ టైన్‌మెంట్, టైటాన్, ఇన్ఫోసిస్, యూపిఎల్, హెచ్‌యుఎల్, సన్‌ఫార్మా, టిసిఎస్ 4నుంచి ఒకశాతం మధ్య పెరిగాయి. డెరివేటివ్స్‌లో ఐజి ఎల్, ఎన్‌ఎండిసి, అరబిందో ఫార్మా, మహా నగర్, ఐబిహౌసింగ్, జిందాల్ స్టీల్, ఆర్‌బిఎల్ బ్యాంకు, మదర్‌సన్ 5-2శాతం మధ్య పడిపో యాయి. టొరంట్ పవర్, జిఎంఆర్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, టొరంట్ ఫార్మా, నాల్కో, మెక్‌డొ వెల్, బిహెచ్‌ఇఎల్ 7-2.5శాతం మధ్యపుంజుకు న్నాయి. బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1420 నష్టపోగా, 985 మాత్రమే లాభపడ్డాయి.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/