మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు బెయిల్ మంజూరు

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీత తో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. అలాగే బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

కాగా సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం కొత్తపల్లి గీత కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా బెయిల్ ఇచ్చారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని గీతకు హైకోర్టు ఆదేశించింది.