నేను బ్రతికే ఉన్నాను..ఫేక్ ప్రచారం ఫై కోటా శ్రీనివాసరావు క్లారిటీ

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించారని ఉదయం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతుండడం తో చాలామంది నిజమే అని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈ వార్తలపై కోటా శ్రీనివాసరావు మీడియా తో స్పందించారు. నేను చనిపోయినట్లు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలని అరికట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. ఉదయం నుండి దాదాపు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని , పోలీసులు కూడా ఉదయం ఇంటికి వచ్చారని కోటా శ్రీనివాసరావు తెలిపారు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయని , ముఖ్యముగా చిత్రసీమ నటి నటులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోట వాపోయారు. బ్రతికుండగానే చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని , అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోటా శ్రీనివాసరావు కోరారు. అలాగే అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు. ప్రస్తుతం వయసు రీత్యా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా కబ్జా మూవీ లో నటించారు.