కట్టె కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే – అల్లు అర్జున్

గత కొద్దీ నెలలుగా అల్లు అర్జున్ మీద మెగా ఫ్యామిలీ అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన అల్లు అర్జున్..ఇటీవల చిరంజీవి పేరు చెప్పకుండా, తాను సొంతంగా ఇండస్ట్రీ లోకి వచ్చినట్లు చెప్పుకోవడం , మెగా హీరోలకు దూరంగా ఉండడం మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం లేదు. ఇదే విషయం ఫై సోషల్ మీడియా లో బన్నీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే చాల కోపం గా ఉన్నారు.

ఈ క్రమంలో నిన్న అల్లు అర్జున్ కట్టె కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే అని చెప్పి మెగా ఫ్యాన్స్ ను శాంతింప చేసాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 )లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇదిలా ఉంటె బేబీ సినిమా భారీ విజయం సాధించడం తో నిర్మాత SKN గురువారం హైదరాబాద్ లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసాడు. దీనికి బన్నీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బన్నీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మాట్లాడుతూ చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే.. అది ఎప్పటికీ మారదు అని అల్లు అర్జున్‌ అని ఆకట్టుకున్నారు. ఈ మాటలకు మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో తెగ షేర్అవుతుంది.