అరుణాచల్‌ప్రదేశ్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం..

massive earthquake in Japan
earthquake

ఈటానగర్‌ : ఈరోజు తెల్లవారుజామున అరుణాచల్‌ప్రదేశ్‌ను భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో కమెంగ్‌లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. అసోంలోని జోర్హాట్‌కు 178 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పాక్‌లోనూ అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌కు 303 కిలోమీటర్ల దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం సభవించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని 120 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/