ధమాకా థియేటర్స్ లిస్ట్

మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధమాకా మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ మూవీ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 228, సీడెడ్‌లో 160, ఆంధ్రాలో 280 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 670 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 70, ఓవర్సీస్‌లో 200 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 940 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. రవితేజ నటించిన గత సినిమాలు ప్లాప్ అయినప్పటికీ..వాటితో సంబంధం లేకుండా ధమాకా ను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.