‘రంగమార్తాండ’ లో అనసూయ రోల్ అదేనట

కృష్ణ వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన రంగమార్తాండ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా విశేషాలను నటి నటులు పంచుకుంటున్నారు. తాజాగా అనసూయ తన రోల్ గురించి తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

“మొదటి నుంచి కూడా నాకు కృష్ణవంశీగారి సినిమాలంటే ఇష్టం. అప్పట్లో ‘మురారి’ చాలాసార్లు చూశాను. అలాంటి కృష్ణవంశీ గారి దర్శకత్వంలో చేసే అవకాశం రావడమే అదృష్టం. కృష్ణవంశీ గారు లేడీస్ పాత్రలను చాలా అందంగా .. చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. ప్రకాశ్ రాజ్ గారి కోడలు పాత్రలో ‘గీతా రంగారావు’గా నేను కనిపిస్తాను” అని , ఈ సినిమాలో నా స్వభావానికి పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను చూసి ఆడియన్స్ తిట్టుకుంటారేమోనని కృష్ణవంశీ గారితో అన్నాను. అలా ప్రవర్తించడం ఆ పాత్ర వరకూ కరెక్ట్ అని ఆయన అన్నారు. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఈ సినిమా చేసినా నా తనివి తీరలేదు. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

సింధూరం , అంతఃపురం , మురారి , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం , చందమామ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ..ప్రస్తుతం ఓ హిట్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో ..ఈయనతో సినిమాలు చేసే నిర్మాతలు సైతం కరువయ్యారు. ప్రస్తుతం రంగమార్తాండ మూవీ పైనే ఈయన ఆశలన్నీ పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రివ్యూ షో ప్రదర్శించగా..చిత్రసీమలో పలువురు సినిమా చూసి ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇక ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం , అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక, ఆదర్శ బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాని హౌస్ ఫుల్ మూవీస్ రాజేష్ శ్యామల ఎంటర్టైన్మెంట్ సమీకంగా నిర్మించాయి. ఈ రంగమార్తాండ సినిమాకు మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.