ఆస్పత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాస్పటల్ పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొద్దీ రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్న కోమటిరెడ్డి..నిన్న ఢిల్లీ నుంచి తిరిగి రాగానే సోమాజిగూడ లోని యశోద హాస్పటల్ లో చేరారు.

ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్య బృందం… రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. దీంతో ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో… భువనగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.