నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ..

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు సంబదించిన నామినేషన్లు ఈరోజు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. కాగా నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనుండగా.. గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

నూతనంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్‌ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే శక్తి ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి, సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.