వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
Minister Harish inaugurates free mineral and cool water plant
సిద్దిపేట : జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నారా..అంటూ ఆరా తీశారు. తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవాలని మంత్రి హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనార్థం గ్రామస్తులకు సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల బాల్రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/