కోహ్లీనే ఇప్పటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్
విండిస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ చంద్రపాల్

గయానా: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనరైన్ చంద్రపాల్ కోహీని ప్రశంశలతో ముంచెత్తాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు, కోహ్లీలా అన్ని ఫార్మాట్లలో ఎవరూ రాణించలేరని, ఆ సత్తా కేవలం కోహ్లీకే ఉంది అన్నాడు. కోహ్లీ ఆటలో అన్ని కోణాలలో ఒకేలా ఆడతాడని శారీరక దృడత్వం కోసం కష్టపడతాడని, ఇప్పటి వరకు తానేంటో ఆటలోనే చూపించాడని అన్నారు. అతని దూకుడు స్వభావమే అతడిని ముందుకు నడిపేల చేస్తుందని చందర్‌పాల్ అన్నారు. కాగా కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు సాధించి సచిన్ 100 సెంచరీల రికార్డుకు చేరువలో ఉన్నాడు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/