రైతుల భూపంపిణీ జీవోపై హైకోర్టు స్టే

కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం సమాలోచన

High court of andhra pradesh
High court of andhra pradesh

అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే హైకోర్టు ఇచ్చింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన…51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు.. జీవోను హైకోర్టులో సవాల్‌ చేశారు. రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే భూములివ్వాలని…సీఆర్డీఏ చట్టంలో ఉందని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు స్టే ఇవ్వడంతో ప్రభుత్వంలో సమాలోచనలు జరుపుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/