కష్టకాలంలో ఉమర్ అక్మల్

విచారణకు ఆదేశించిన పిసిబి

umar akmal
umar akmal

కరాచీ; పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై పిసిబి జీవిత కాలం నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ ఫిక్షింగ్ కోసం అతడు బుకీలను సంప్రదించినట్లు ఇటీవల వెలుగులోకి రావడంతో అతడిపై పిసిబి విచారణకు ఆదేశించింది . మార్చ్ 31 లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పిసిబి ఆదేశించింది. అతడు చెప్పే సమాధానంతో పిసిబి ఏకీభవించక పోయినట్లయితే అతడిపై జీవిత కాల నిషేధం విదించే అవకాశం ఉంది. అయితే పిఎస్ఎల్ 2020 సీజన్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న అక్మల్ కు, చెల్లించిన అడ్వాన్సును తిరిగి ఇవ్వాలని క్వెట్టా గ్లాడియేటర్స్ టీం మేనేజిమెంట్ డిమాండ్ చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి ;https://www.vaartha.com/andhra-pradesh/