దేశంలో 415కి చేరిన కరోనా కేసులు
నిన్న ఒక్కరోజు దేశంలో 19 మందికి కరోనా పాజిటివ్ కేసులు ..ప్రకటించిన ఐసీఎమ్ఆర్

న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజు దేశంలో 19 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనాతో ఇప్పటివరకు దేశంలో ఏడుగురు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందగా, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్ల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నిన్న అత్యధికంగా ముంబయి లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. కర్ణాటకలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు. కర్ణాటకలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/