మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గా: సింధు

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు


అమరావతి : సిఎం జగన్ ను పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సింధు కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు. కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్‌తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. నేడు కేబినెట్‌ భేటీలో చర్చించన అనంతరం సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారని ఆమె తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం అని పేర్కొన్నారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్‌ పురస్కార అవార్డులు ఇస్తున్నారన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు తెలిపారు.

CM Jagan-PV Sindhu: సీఎం జగన్‌ కలిసిన పీవీ సింధు.. ఏపీలో అకాడమీ ఏర్పాటుపై  చర్చ | Tokyo olympic bronze medal winner pv sindhu meets andhra pradesh cm  ys jagan mohan reddy | TV9 Telugu

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/