టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుంది.. ప్రొ.కోదండరామ్

kodandaram
kodandaram

హైదరాబాద్‌ః తెలంగాణ ఉద్యమనేత, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఆయనతో చర్చలు జరిపిన తర్వాత కోదండరామ్ ఈ ప్రకటన చేశారు. భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ తో చర్చించినట్టు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశమవుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతామని… ఆ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. అందరి లక్ష్యం కెసిఆర్ ను ఓడించడమేనని అన్నారు.

కాగా, తెలంగాణలో కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఆగమైపోతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో ఏమి సక్రమంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అన్ని పార్టీలతో ఏకమై ఓడించడమే లక్ష్యం అని పేర్కొన్నారు ప్రొ.కోదండరామ్. కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కి తగిన బుద్ది చెబుతుందని మద్దతు కోరుతున్నట్టు స్పష్టం చేశారు.