పార్టీ మార్పుపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయలేను.. రాజగోపాల్‌ రెడ్డి

komatireddy-rajagopal-reddy-clarity-on-party-change-rumors

న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు తాను సిద్ధంగా లేనని బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తేల్చి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్‌లోకి మళ్లీ రావాలని నా మిత్రులు అడుగుతున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు లేవు. నేను బిజెపిను వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి లాంటివారు నాపై దుష్ప్రచారం చేశారు. రేవంత్‌ 20 ఏళ్లు టిడిపిలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. మేం ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లం. ఇప్పుడు వచ్చిన రేవంత్‌ నాయకత్వంలో ఎలా పనిచేయాలి? నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. పోరాడే వ్యక్తిని’’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.