నేడు ఉత్త‌రాఖండ్ లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ : నేడు ప్రధాని మోడీ ఉత్త‌రాఖండ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉత్త‌రాఖండ్ లో మొత్తం రూ.17,500 కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారని పీఎం కార్యాలయం తెలిపింది. లఖ్‌వర్ బహుళార్థ సార్థక ప్రాజెక్టు, 85 కి.మీ. నాలుగు లేన్ల మోరదాబాద్ – కాశీపూర్ రోడ్డు, 22కి.మీ.ల గదర్‌పూర్ – దినేశ్‌పూర్, మడ్‌కోట, హల్దావాని రోడ్డు (ఎస్‌హెచ్-5), 18 కి.మీ. కిచ్చా టూ పంత్‌నగర్ (ఎస్‌హెచ్-44), ఉద్ధమ్ సింగ్ నగర్‌లో 8 కి.మీ. ఖటిమ బైస్ రోడ్డు, నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్తాపన చేయనున్నారు.

లఖ్‌వర్ బహుళార్థ సార్థక ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల సౌకర్యాల పెంపుదల, జల విద్యుత్ ఉత్పత్తితోపాటు న్యూఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు తాగునీరంద‌నున్న‌ది. రోడ్ల విస్తరణ ద్వారా రిమోట్ ఏరియాలకు రవాణా సౌకర్యం పెరగనున్నది. అయితే వచ్చే ఏడాదిలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో 23 ప్రాజెక్టులకు ఇవాళ ప్రధాని మోడీ శంకుస్తాపన చేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/