చివరికోరిక తీరకుండానే చనిపోయిన తారకరత్న

నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తారకరత్న ఇక లేరు అనే వార్త ను సినీ , నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. గుండెపోటు కు గురై హాస్పటల్ పాలైన తారకరత్న..క్షేమంగా తిరిగి వస్తారని అంత అనుకున్నారు కానీ ఇలా భౌతిక కాయం వస్తుందని ఎవ్వరు ఊహించుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసం లో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచారు. ఉదయం నుండి కూడా పెద్ద సంఖ్య లో సినీ , రాజకీయ , టీడీపీ శ్రేణులు కడసారి చూసేందుకు క్యూ కట్టారు.

ఇదిలా ఉంటె ఈ మధ్య రాజకీయాల్లోకి రావాలని ఆ మధ్య చాలా ప్రాంతాల్లో తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరిగారు తారకరత్న. అంతేకాదు.. గుడివాడ నుంచి తారకరత్న పోటీచేయాలని గట్టి ప్రయత్నాలే చేసారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌కు కూడా చెప్పినట్లు సమాచారం. వారిద్దరి నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ తారకరత్న చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఇక నందమూరి కుటంబాన్ని అనుకోని ప్రమాదాలు, హఠాన్మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే.. మరికొందరు అనారోగ్య సమస్యలతో అంటే గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదంతా చూసి మిగతా కుటుంబసభ్యులే కాదు, అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒకరో ఇద్దరో అది కూడా అనుకోకుండా జరిగితే తట్టుకోగలరు గానీ ఏళ్ల వ్యవధిలో మరణిస్తుండటం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది.