ఐటీ రైడ్స్ ఫై కిషన్ రెడ్డి కామెంట్స్

ఎన్నికల వేళ కాంగ్రెస్ లీడర్స్ ఇళ్లపై , ఆఫీస్ లపై ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. నిన్న పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి చెందిన ఆఫీస్ లపై ఇళ్లపై అలాగే ఆయనకు సంబదించిన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేసారు. ఈ దాడులపై పొంగులేటి తీవ్రంగా తప్పు పట్టింది. కావాలనే బిజెపి , బిఆర్ఎస్ తమపై ఐటీ దాడులు చేయిస్తుందని ఆరోపించారు.

ఈ క్రమంలో కిషన్ రెడ్డి..కాంగ్రెస్ ఆరోపణలను తప్పుపట్టారు. ఇది బీజేపీ పనే అంటూ పొంగులేటి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల పని వారు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తున్నారని అన్నారు. ఐటీ సోదాలకు, తమకు సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు దాడి చేస్తారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అయినా.. సీబీఐ, ఈడీని స్థాపించింది కాంగ్రెస్ పార్టీనే కదా అని వ్యాఖ్యానించారు.