షర్మిలపై మోడీకి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిః సత్యవతి

ఎమ్మెల్యేలను బేరమాడేందుకు స్వామీజీలను పంపుతున్నారని ధ్వజం

telangana-minister-satyavathi-rathod-fires-on-modi

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంపై ప్రధాని మోడీ విషం కక్కుతున్నారని, ఎమ్మెల్యేలను బేరమాడేందుకు స్వామీజీలను పంపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎన్నోసార్లు సిఎం కెసిఆర్ సహా రాష్ట్ర మంత్రులు ప్రధానిని కలిశారని, అయినా కనికరించని మోడీకి షర్మిలపై అకస్మాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. షర్మిల ఇన్ని రోజులు ఆడిన నాటకానికి మోదీనే సూత్రధారని ఆరోపించారు. వార్డు సభ్యురాలు కూడా కాని షర్మిలకు మోదీ ఫోన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కెసిఆర్‌ను తక్కువ చేసి ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకే కాదని, ఇక్కడ రాళ్లకు కూడా పవర్ ఉంటుందని మంత్రి హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/