పులి డాన్సులతో అదరగొట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్.. తానెప్పుడూ ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలోనైనా.. అసెంబ్లీ లోనైనా.. ఆకట్టుకునే స్టైల్ ఆ ఎమ్మెల్యేది. తన ఆహబావాలతో, మాటలతో జోకులేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసే మధుసూదన్ రెడ్డి తాజాగా తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో దసరా పులి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.

ఊరేగింపులో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తప్పెట్ల మోతకు ఉత్సాహంగా కాలు కదిపారు. కొందరు కళాకారులు పులివేషాలు వేసుకుని డ్యాన్స్ చేస్తుండగా, ఎమ్మెల్యే కూడా హుషారుగా రంగంలోకి దిగారు. తప్పెట్ల మోతకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.