కిరణ్ అబ్బవరం ‘మీటర్’ కథ ఇదే..

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ ను భారీగా చేస్తూ వస్తున్న మేకర్స్..తాజాగా ఓ మీడియా ఛానల్ లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం సినిమా కథ ఏంటి అనేది తెలిపాడు.

హీరో పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని తండ్రి డ్రీమ్. ఆ విషయంలో హీరో తండ్రికి ప్రామిస్ చేస్తాడు. కానీ అతనికి పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. అందువలన అతను ఏం చేశాడనేది పూర్తి ఎంటర్టయిన్మెంట్ తో నడుస్తుంది. హీరోయిన్ రోల్ కూడా అందుకు తగినట్టుగానే ఉంటుంది. అతుల్య రవి చాలా బాగా చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. “ఇది పక్కా మాస్ ఎంటర్టయినర్ .. నాకు చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. అందువలన అలాంటి సినిమాలు పడినప్పుడు నేను ఇష్టంతో చేయడం వలన ఈజీగా చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది … సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది” అన్నాడు.

“ఈ సినిమా కథ పరిధి పెద్దది .. అందుకోసం చేసిన ఖర్చు కూడా ఎక్కువే. అందువలన ఇది చిన్న సినిమా కానే కాదు. హీరో ప్రతి విషయాన్ని మీటర్ తో ముడిపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ‘నా మీటర్లో నేను వెళతాను .. నన్నెవ్వడూ ఆపలేడు’ అన్నట్టుగా ఉంటుంది అని తెలిపాడు.