మరోసారి మళ్లీ గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని మంగళవారం మళ్లీ గృహ నిర్బంధంలో ఉంచారు. కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేనందున మాజీ సీఎంను గృహనిర్బంధంలో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ‘‘ అఫ్ఘాన్ ప్రజల హక్కుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం కశ్మీరీల హక్కులను ఉద్ధేశపూర్వకంగా హరిస్తోంది, కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేవనే తప్పుడు వాదనలతో ఈ రోజు నన్ను గృహనిర్బంధంలో ఉంచారు’’ అని మెహబూబా ట్వీట్ చేశారు.

వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గీలాని మృతదేహాన్ని పాకిస్థాన్ జెండాతో కప్పి, భారత వ్యతిరేక నినాదాలు చేసిన ఘటనపై పోలీసులు కేసు పెట్టారని కశ్మీరును ఓపెన్ ఎయిర్ జైలు అంటూ మెహబూబా ఆరోపించారు. కశ్మీరును ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చారని, చనిపోయిన వారిని కూడా విడిచిపెట్టలేదని మెహబూబా ఆరోపించారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/