గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కి ‘ఫుట్ బాల్ ‘ సింబల్ కేటాయించిన భారత ఎన్నికల కమీషన్

గాలి జనార్దన్ రెడ్డి “కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ” కి భారత ఎన్నికల కమీషన్ సింబల్ ను కేటాయించింది. 2022 డిసెంబర్ 25వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టి బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించి ఇన్ని నెలలు కావొస్తున్నా ఆయన పార్టీ కి ఎన్నికల కమీషన్ సింబల్ ను కేటాయించలేదు. దీంతో అందరిలో టెన్షన్ వాతారవరణం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. ఈ క్రమంలో సోమవారం ఎన్నికల కమీషన్ సింబల్ గాలి జనార్దన్ రెడ్డికి తీపి కబురు తెలిపింది.

గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ గుర్తుగా ‘ఫుట్ బాల్ ‘ సింబల్ కేటాయిస్తూ భారత ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తు ఉపయోగించడానికి అధికారికంగా గాలి జనార్దన్ రెడ్డికి అన్ని హక్కులు చిక్కాయి. సోమవారం తమ పార్టీకి ఎన్నికల చిహ్నంగా ఫుట్ బాల్ గుర్తు కేటాయించడంతో బళ్లారితో పాటు ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఫుట్ బాల్ గుర్తుకే మన ఓటు అంటూ గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఫెక్ల్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ఇక కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తుండగా, బళ్లారి సిటీ నుంచి తన భార్య లక్ష్మీ అరుణ పోటీ చేయనున్నారు.