ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రజల్ని బలిగొంటున్నారు:

ప్రజావేదిక ధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందన్న లోకేశ్

lokesh

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సారి జగన్ ప్రభుత్వం పై మండిపడరు. ప్రజావేదిక ధ్వంసంతో ఆరంభమైన జగన్ రెడ్డి జేసీబీ పాలన… క్రమంగా ప్రతిపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యం చేసుకుందని లోకేశ్ దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రజల్ని కూడా బలిగొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జేసీబీతో తొక్కించి చంపడం వైస్సార్సీపీ రాక్షస పాలనకు పరాకాష్ట అని అన్నారు. వైస్సార్సీపీ నేతల ఆదేశాలతో కొంతమంది అధికారులు సుపారీ గ్యాంగుల్లా తయారయ్యారని.. వృద్ధురాలిని చంపిన అధికారులను, దీని వెనుక ఉన్న వైస్సార్సీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న నిరుపేదలకు పట్టాలివ్వాలివ్వాలని అన్నారు.