కరోనా పై సిఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమీక్ష

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ కరోనా వైరస్‌ నియంత్రణ నేపథ్యలో తీసుకోవాల్సిన చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. కాగా, ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, ఖకరోనాగ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. నేటి నుంచి విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/