కేజీఎఫ్ ఫేమ్ కృష్ణ జి. రావు కన్నుమూత

కెజిఎఫ్ మూవీ లో కళ్లులేని తాత గా కనిపించి తన నటనతో అందర్నీ కట్టిపడేసిన నటుడు కృష్ణ జి. రావు కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న కృష్ణ జి. రావు.. ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

అసిస్టెంట్ డైరెక్టర్, మూవీ రైటర్‌గా కొన్ని సినిమాలకి పనిచేసిన కృష్ణ.. కేజీఎఫ్ మూవీలో ఓ వృద్ధుడి పాత్ర కోసం ఆర్టిస్ట్‌ని వెతుకుతున్నారని కృష్ణ కు ఎవరో చెప్పారట. కానీ తన ఫొటోని పంపేందుకు అతను నిరాకరించినట్లు గతంలో గుర్తు చేసుకున్నారు. అయితే.. కన్నడ ఇండస్ట్రీలోని ఓ ప్రొవిజినల్ మేనేజర్ కృష్ణ జి. రావు ఫొటోని పంపడం.. యశ్‌కి అతను నచ్చడంతో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేజీఎఫ్ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్ అవడంతో కృష్ణ జి. రావుకి వరుస అవకాశాలు దక్కాయి. ఇటీవల లీడ్ రోల్‌‌లో ఓ సినిమా కూడా ప్రారంభమైంది. కానీ.. షూటింగ్ పూర్తవకముందే కృష్ణ జి. రావు చనిపోయారు.