యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ

యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధువారం జగిత్యాల పర్యటన లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్..అనంతరం సభలో మాట్లాడుతూ..తెలంగాణ ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వ‌రం, ధ‌ర్మ‌పురి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న దేవాల‌యంతో పాటు ప‌లు పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. కొండ‌గ‌ట్టు అంజ‌న్న స‌న్నిధికి హ‌నుమాన్ భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు.

అంజ‌న్న దేవ‌స్థానం కేవ‌లం 20 ఎక‌రాల్లో మాత్ర‌మే ఉండేది. 384 ఎక‌రాల స్థలాన్ని దేవాల‌యానికి ఇచ్చాం. 400 ఎక‌రాల భూమి కొండ‌గ‌ట్టు క్షేత్రంలో ఉంది. కొండ‌గ‌ట్టు అంజ‌న్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే నేను స్వ‌యంగా వ‌చ్చి ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం, భార‌త‌దేశంలో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి పుణ్య‌క్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.