ప్రజలకు హెచ్చరిక జారీచేసిన భారత వాతావరణ శాఖ

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్రమైన చలి వణికిస్తుంది.అలాగే దట్టమైన పొగ మంచు కమ్మేస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు చలితో వణికి పోతున్నారు. ఉదయం 9 దాటేవరకు కూడా పొగ మంచు వీడడం లేదు. ఈ పొగమంచు కారణంగా రోడ్లపై అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఈ చలి తగ్గుతుంది రా బాబు.. అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కీలక అప్డేట్ ని వాతావరణ శాఖ తెలియజేసి షాక్ ఇచ్చింది.

రానున్న రోజుల్లో ఢిల్లీ ,పంజాబ్, హర్యానా . ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా దట్టమైన పొగ మంచు ఏర్పడుతుందని బలమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జనవరి 8 నుండి 10 తేదీల్లో రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఉరుములు లేదా వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.