తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీస్ కేసు నమోదు

ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఇతనిపై నిత్యం పోలీసులు ఏదో ఒక కేసు నమోదు చేస్తూ ఆయనను వార్తలతో నిలిచేలా చేస్తూ ఉంటారు. ఇప్పటికే పలు వివాదాల్లో నిలిచిన రాజాసింగ్ తాజాగా మరో కేసులో చిక్కుకున్నాడు. రాజాసింగ్ పై మహారాష్ట్ర సోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ కుమారుడు ఎమ్మెల్యే నితీష్ రాణే పై కేసు నమోదు చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వీరు ప్రసంగం చేశారంటూ పోలీసులు కేసు పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం షోలాపూర్ లోని రాజేంద్ర చౌక్ నుంచి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజాసింగ్, నితీష్ లతో పాటు హిందూ సమాజ్ నేతలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ జైల్ రోడ్డు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. దీంతో రాజాసింగ్ తో పాటు ఎమ్మెల్యే నితిన్ షానాపై ఐపీసీ 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.