నా ఫేవరేట్‌ హీరో ‘బాహుబలి’

టాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ ఆసక్తికర రిప్లై

Alia Bhatt
Alia Bhatt

బాలీవుడ్‌లో టాప్‌గేర్‌లో ఆలియాభట్‌ దూసుకుపోతోంది.. ప్రస్తుతం ఆమె చేతిలో బడా ప్రాజెక్టులే ఉన్నాయి.

హిందీలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయి చిత్రంతో పాటు రణ్‌బీర్‌కపూర్‌కు జంటగా బ్రహ్మాస్త్ర అనే భారీ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నటిస్తోంది..

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో ఈ భామ చరణ్‌కు జోడీగా నటిస్తోంది..

రామరాజు ప్రేయసి సీత పాత్రలో కన్పించనుంది.. కాగా టాలీవుడ్‌ నుంచి ఈ భామను ఫేవరేట్‌ స్టార్‌ ఎవరని అడగ్గా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పింది..

ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని తెలిపింది.. ఆయన నటించిన బాహుబలి చూశాక ఆయనకు ఫ్యాన్‌ అయిపోయిందని తెలిపింది..

టాలీవుడ్‌ నుంచి తనకు బాగా నచ్చిన హీరోల్లో ప్రభాస్‌ అని ఆమె చెప్పుకొచ్చింది..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/