బాబు గ్యారంటీ బుర్రలేని లోకేశ్కే: కేశినేని

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫై ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. బాబు గ్యారంటీ బుర్ర లేని లోకేశ్కే అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. టీడీపీలో ఎవ్వరికీ షూరిటీ లేదని అన్నారు. ఇచ్చిన మాట తప్పడమే బాబు నైజమని దుయ్యబట్టారు. ఎలాగూ ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోతాడని.. ఆ తర్వాత రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబుపై కూడా సెటైర్లు వేశారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఇంట్లోంచి బయటికి వచ్చేవాడు. ఇంటి ఎదురుగానే హెలిప్యాడ్ ఉండేది. అక్కడివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లో వచ్చి, హెలిప్యాడ్ లో ఉన్న హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లేవాడు. అక్కడ్నించి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేవాడు.

ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి… మా రాష్ట్రం పరిస్థితి బాగా లేదు.. డబ్బులు కావాలి అని అడిగేవాడు. చంద్రబాబు ఇటు తిరగ్గానే ఆయన (ప్రధాని) మాతో చెప్పేవాడు… ఆయన ఇంటి ముందు హెలికాప్టర్ ఎక్కి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి, అక్కడ్నించి స్పెషల్ ఫ్లయిట్ ఎక్కి ఇక్కడికి వచ్చి మా రాష్ట్రం పేదది అంటాడేంటి అనేవారు. మమతా బెనర్జీ రబ్బరు చెప్పులు వేసుకుని, రూ.100 చీర కట్టుకుని మామూలు విమానంలో వస్తుంది… శాంట్రో కారులో తిరుగుతుంది. వాళ్ల రాష్ట్రం పేదది అంటే ఎవరైనా నమ్ముతారు కానీ, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే ఎలా నమ్ముతాం అనేవారు. ఆయనదంతా హైప్… ఈయనది (జగన్ ది) రియాలిటీ” అని కేశినేని వ్యాఖ్యానించారు.