ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి – వైవీ సుబ్బారెడ్డి

yv-subbareddy

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఏపీ రాజధాని అంశం తెరపైకి వస్తుంది. టిడిపి హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చి..అసలు ఏపీకి రాజధానే లేకుండా చేసారు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండం తో అంత దీనిపై చర్చ మొదలుపెట్టారు.

మొన్నటి వరకు ఏపీకి మూడు రాజధానులు అని చెప్పిన అధికపార్టీ..ఇప్పుడు అమరావతే రాజధాని అని మంత్రి అంబటి అంటుంటే..వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికీ వారు రాజధాని ఫై కామెంట్స్ చేస్తుండడం తో ప్రజలు నవ్వుకుంటున్నారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ నే ఉమ్మడి రాజధాని చేయాలనీ సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. కాగా జూన్తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వైవీ సుబ్బారెడ్డి నిన్న నామినేషన్ వేశారు.