ఎంపీగా పోటీ చేస్తే నాని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడుః కేశినేని చిన్ని

kesineni-nani-comments-on-kesineni-chinni

అమరాతిః విజయవాడ ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నేత కేశినేని నానిపై ఆయన సోదరుడు, టిడిపి నేత కేశినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంతో… సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభకు కేశినేని నాని పోటీ చేస్తే కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అయితే, విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు.

టిడిపిలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని… వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్లిన తర్వాత ఆయన స్థాయి దిగజారిందని చిన్ని చెప్పారు. దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని తమ నాయకత్వం సూచిస్తుందో… అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు.