ఇంకా ICU లోనే చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు , చలాకీ చంటి

కమెడియన్ చలాకీ చంటి , సీనియర్ నటుడు శరత్ బాబు లు ఇద్దరు కూడా ఇంకా ICU లోనే చికిత్స తీసుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న శరత్ బాబు..రీసెంట్ గా ఆరోగ్య పరిస్థితి విషయం కావడం తో హైదరాబాద్ లోని AIG హాస్పటల్ లో చికిత్స జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ ఫై ఉన్నాడు.

అలాగే జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి సైతం ఇటీవల గుండెపోటుకు గురి కావడం తో కేర్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. చంటికి సన్నిహితులుగా ఉండే వారు అందిస్తున్న సమాచారాన్ని చూస్తే.. కొద్ది రోజుల క్రితం చంటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని చెబుతున్నారు. తాజాగా ఈ నెల 21న మరోసారి గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. దీంతో అతడ్ని వెంటనే గచ్చిబౌలి కేర్ కు తీసుకెళ్లి జాయిన్ చేశారు. రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

దీంతో చంటికి సర్జరీ చేసి స్టంట్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.