స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కెసిఆర్‌ఆర్

విపక్ష నేతగా తొలిసారి టీఎస్ అసెంబ్లీకి వచ్చిన కెసిఆర్

KCR took oath as MLA

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బిఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం.

ఇంకోవైపు, తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కెసిఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా, ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. ముఖ్యమంత్రిగా గత పదేళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కెసిఆర్… ఈరోజు గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.