ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కొవిడ్ పాజిటివ్

ఆందోళన చెందనక్కర్లేదని వెల్లడి

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా కొవిడ్ బారినపడ్డారు. కొవిడ్ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని శరద్ పవార్ స్వయంగా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. డాక్టర్లు సూచించిన మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శరద్ పవార్ సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/