ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడింది – కేశినేని చిన్ని

ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పార్టీ దాడులకు తెగబడిందన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారని.. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారని.. కేవలం ఓటు వేయడం కోసమే విదేశాల నుంచి కూడా తరలి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ..ఈ వైసీపీ ప్రభుత్వం ఫై ఎంత కసి ఉన్నారో అని చిన్ని అన్నారు.

ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు.