మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం

హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట నుంచి టేకాఫ్ కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వేపై నిలిచిపోయింది. ఆ ఫ్లైట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మల్యేలు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరంతా కొచ్చిన్ వెళ్తున్నారు. గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంతో బిజీ బిజీగా గడిపిన వీరు కాస్త రిలాక్స్ కోసం కొచ్చిన్ వెళ్తున్నారు కావొచ్చు.