ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు అందించబోతుంది

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నెలాఖరులో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మధ్యంతర ఉపశమనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం.

వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వినికిడి. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటన్నింటికి సంబంధించి కార్మిక సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలో సమావేశం కాబోతున్నారు. కార్మిక సంఘాలతో కేసీఆర్ సమావేశమై నేరుగా వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అన్నీ కుదిరితే మరో పది రోజుల్లో ఈ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం. పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, తాత్కాలిక పోస్టును త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.