యూట్యూబ్ లో అదరగొడుతున్న ‘మిల్కీబ్యూటీ’ సాంగ్

వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం భోళా శంకర్ మూవీ తో ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా , కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో మేకర్స్ సినిమా తాలూకా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్ ..శుక్రవారం సినిమాలోని మూడో సాంగ్ మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటూ సాగే పాట ను రిలీజ్ చేసారు.

ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ఇందులో చిరు, మిల్కీబ్యూటీ జోడి ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నా, చెల్లి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video