స్వల్ప అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా కేసీఆర్ వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఇంట్లోనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల బృందం సీఎంను నిత్యం పర్యవేక్షిస్తుంది. కొన్ని రోజుల్లోనే ఆయన కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు” అని తెలిపారు. కేటీఆర్ ఈ విషయం తెలుపగానే.. అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.